Ad Code

Responsive Advertisement

దసరా నవరాత్రుల ప్రాముఖ్యత

  • ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవి నవరాత్రుల పూజను ప్రారంభించాలి అని శాస్త్రం చెబుతోంది.
  • ఆలా  వీలుకానివారు తదియ, పంచమి, సప్తమి రోజునుండి దేవీపూజను ప్రారంభించవచ్చు.
  • దేవీ పూజలో భక్తితో పాటు నియమనిష్టలను పాటించడం ఎంతో అవసరం
  • ఈ నవరాత్రి పూజను కలశస్థాపన చేసి ప్రారంభించాలి.
  • ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి, తలంటుస్నానం చేసేయి శుద్ధమైన వస్త్రాలు ధరించి అమ్మవారిని విధివిధానంగా పూజించాలి.
  • సాయంకాలం కూడా అమ్మవారిని శాస్త్రబద్ధంగా పూజించడం తప్పనిసరి.
  • దీక్షాకాలంలో ఒక్కపూటనే భోజనం చేసి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరించాలి.
  • అది సాధ్యంకాని వారు మధ్యాహ్నం అల్పాహారాన్ని స్వీకరించి, రాత్రి భోజనం చేయవచ్చు.
  • దేవీ నవరాత్రులలో అవకాశం వున్నవారు కుమారీ పూజ, సువాసిని పూజ, దంపతి పూజ చేసుకోవడం శుభప్రదం.
  • కుమారీపూజలో 2 నుండి 8 యేళ్ళ వయసుగల బాలికలను జగన్మాతగా భావించి పూజిస్తారు. 
  • అలాగే సువాసినీ పూజలో ముత్తైదువులను, దంపతి పూజలో దంపతులను పూజించాలి.
  • ఈ నవరాత్రి పూజలో ఆయా రోజులందు ఆయా అమ్మవారి రూపాలు విధివిధానంగా పూజించడం సంప్రదాయం.


అమ్మవారికి పుష్ప అలంకరణలు

పాడ్యమి నాడు - మల్లెలమాల, బిల్వదళమాలతో
విదియ నాడు - జాజి పూలదండ , తులసిదళమాలతో 
తదియ నాడు - సంపంగి పూలమాల లేదా మరువం దండతొ
చవితి నాడు -  జాజి పూలమాల లేదా చిలకాకుపచ్చ రంగు మాలతో
పంచమి నాడు - పారిజాత కుసుమాల లేదా బూడిదరంగు ఆకూ మాల
షష్ఠి నాడు - మందార మాల లేదా గంధపు ఆకుమాలతో
సప్తమి నాడు - మొగలిపూలదండ లేదా తుమ్మిఆకుల దండతొ 
అష్టమి నాడు - గులాబీమాల లేదా పన్నిరాకుల మాల 
నవమి నాడు - మరువ,దావన ఆకుల మాలతో నేరేడు ఆకుల మాలతో అమ్మవారిని అలంకరించాలి .

2022 : సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 04 వరకు 

Post a Comment

0 Comments