Ad Code

Responsive Advertisement

భీష్మ పంచక వ్రతం (అగ్ని పురాణం)



  • సకల మనోరథాలనీ తీర్చేది సకల పాపాలనీ తొలగించేది శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది భీష్మపంచక వ్రతం.
  • ఈ వ్రతాన్ని కార్తీక శుద్ధ ఏకాదశినాడు ప్రారంభించి, వరుసగా ఐదురోజుల పాటు మూడుకాలాల్లో స్నానంచేసి, నువ్వులతో, యవలతో దేవతలకి, పితృదేవతలకి అయిదు తర్పణాలు ఇవ్వాలి. 
  • ఈ అయిదు రోజాలు తర్పణాలిచ్చిన తరువాత శ్రద్ధగా శ్రీమహావిష్ణువుని పూజించాలి.
  • పంచామృతాలతో, పంచగవ్యాలతో శ్రీహరి ప్రతిమకి స్నానం చేయించి చందనాది సుగంధ ద్రవ్యాలు, గుగ్గిలం వేసి ధూపాన్ని, ఆవునేతితో దీపాన్ని సమర్పించాలి. 
  • ఆ తరువాత మధురమైన భోజన పదార్థాలని, పిండివంటల్ని యథాశక్తి స్వామికి నివేదించాలి. తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 
  • జపానంతరం “ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా” అనే మంత్రం చెబుతూ నెయ్యితో తడిపిన నువ్వుల్ని ఉపయోగించి హోమం చేయాలి.
  • మొదటిరోజు నారాయణుడి పాదాల్ని కమలాలతో, రెండో రోజు స్వామి మోకాళ్ళని, తొడల్ని బిల్వ పత్రాలతో, మూడోరోజు స్వామి నాభి (బొడ్డు) ప్రదేశాన్ని భృంగరాజు (గుంటగలగర) పత్రాలతో, నాలుగోరోజు హృదయాన్ని ముఖాన్ని బాణ పుష్పాలు బిల్వపత్రాలు, జపాకుసుమాలతో, అయిదో రోజు స్వామి సర్వాంగాలనీ మాలతీ పుష్పాలతో పూజించాలి.
  • ఈ పూజ చేసేడప్పుడు శ్రీమహావిష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, సహస్రనామ స్తోత్రాన్ని గానీ పఠించాలి.
  • మహాపవిత్రమైన ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించే వారు వ్రతం చేసే అయిదు రోజులూ నేలమీదే పడుకోవాలి. 
  • ఏకాదశి నాడు (ఆవుపేడని), ద్వాదశిరోజు గోమూత్రాన్ని, త్రయోదశినాడు ఆవు పెరుగుని, చతుర్ధశి రోజు ఆవుపాలని, వ్రతం చివరిరోజు పంచగవ్యాలని కొద్దిగా స్వీకరించాలి చివరిరోజైన పౌర్ణామాసినాడు నక్తం అనగా ఉదయం ఉపవాసముండి రాత్రి భోజనం చేయాలి.
  • ఈ విధంగా భీష్మపంచక వ్రతాన్ని శ్రద్ధా భక్తులతో ఆచరించిన వారు భుక్తిముక్తి పొందుతారు. 
  • పూర్వం కురువృద్ధుడైన భీష్మపితామహుడు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్లే శ్రీహరిని చేరుకున్నాడు. అందుకే ఈ వ్రతానికి భీష్మ పంచక వ్రతమని పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు కూడా ఈ దివ్యవ్రతాన్ని ఆచరించి శ్రీహరిని పూజించాడు. 
  • కనుక సకల శుభాలని కలిగించే ఈ వ్రతం అందరూ ఆచరించి తమ తమ పాపాల్ని పోగొట్టుకోవచ్చు.

Post a Comment

0 Comments