Ad Code

Responsive Advertisement

పుణ్యక్షేత్రాలు (శివ పురాణం)

ఏభై కోట్ల యోజనాల విస్తీర్ణంలో, పెద్ద పర్వతాలతో దట్టమైనఅరణ్యాలతో, జీవనదులతో విలసిల్లుతున్న ఈ పృధ్వీమండలం అంతా పరమేశ్వరుడి ఆజ్ఞతో ప్రాణుల్ని ధరించి ఉంది. ఈ సకల జగత్తుకి నాథుడైన ఆ మహాదేవుడు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకి మోక్షాన్నిఅందించటం కోసం ఆయా స్థలాల్లో పుణ్యక్షేత్రాలు విలసిల్లేలా చేసాడు భూలోకంలో ఉన్న ఈ దివ్య స్థలాలలో ఋషులు నివసించటం వల్ల కొన్ని దేవతలు అనుగ్రహించటం వల్ల మనికొన్ని, స్వయంభూలింగాలు ఆవిర్భవించటం వల్ల ఇంకొన్ని స్థలాలు దివ్యక్షేత్రాలుగా, పుణ్యతీర్ధాలుగా మారి మానవులందరకీ శుభాల్ని చేకూరుస్తున్నాయి.


  • పుణ్య క్షేత్రాలలో సాధారణంగా తీర్థాలుంటాయి. అవి చాలా పవిత్రమైనవి. అలాంటి తీర్థాల్లో నిత్యం స్నానం, దానం, జపతపాలు ఆచరించాలి. 
  • ఈ విషయం తెలిసి ఆచరించని మానవులు రోగాలు, దారిద్య్రం  అనుభవిస్తాడు. 
  • ఈ భూమండలంలోని క్షేత్రాలలో న్వయంభూ క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవి. ఈ స్వయంభూ క్షేత్రాల్లో మరణించిన వారికి పునర్జన్మ ఉండదు. 
  • పుణ్య క్షేత్రాల్లో పాపం చేస్తే అది ఎంతో పాపాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ క్షేత్రాల్లో నివసించే వారు అక్కడికి దర్శనానికి వచ్చేవారు ఎలాంటి పాపం చేయకూడదు. 
  • ఏదో విధంగా ప్రయత్నించి పుణ్యక్షేత్రాలలో నివాసం ఉండటానికి మానవులు ప్రయత్నించాలి.

Post a Comment

0 Comments