Ad Code

Responsive Advertisement

పంచాక్షరీ జపం (శివ పురాణం)



  • పంచాక్షరీ మంత్రాన్ని నిత్యం పదివేలు జపించాలి. లేదా ఉభయ సంధ్యలలో రోజూ 1వేయి జపించినా శివసాయుజ్యం లభిస్తుంది.
  • బ్రాహ్మణ వర్ణం వాళ్ళు పంచాక్షరికి (నమః శివాయ) ముందు ఓం కారాన్ని చేర్చి జపించాలి. ఈ మంత్రాన్ని దీక్షా పూర్వకంగా గురువు నుంచి స్వీకరించి జపిస్తే ఫలితం త్వరగా లభిస్తుంది. 
  • బ్రహ్మణులు 'నమశ్శివాయ' అని ఇతర వర్ణాలవాళ్ళంతా 'శివాయనమః' అని జపించాలి. స్త్రీలు కూడా శివాయనమః అనే జపించాలి. ఇలా సంచాక్షరీ మంత్రాన్ని ఐదు కోట్లు జపిస్తే శివసాయుజ్యం పొందుతారు. 
  • ఒకటి, రెండు, మూడు లేదా నాలుగు కోట్లు జపం చేస్తే క్రమంగా బ్రహ్మ, విష్ణువు, రుద్ర, మహేశ్వరుల పదం లభిస్తుంది.
  • ఈ పంచాక్షరిలోని ఒక్కో అక్షరానికి 1 లక్ష చొప్పున, 5 అక్షరాలకి 5 లక్షలసార్లు అక్షరలక్షల జపం చేయ్యాలి. లేదా ప్రతిరోజూ 1వెయ్యి సార్లు 1 వెయ్యి రోజులు జపించి నిత్యం యధాశక్తి బ్రహ్మణులకు భోజనం పెడితే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
  • ప్రతిరోజూ బ్రహ్మణుడు నూట ఎనిమిది సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి శివసాయుజ్యాన్ని అందించే వేద మంత్రాలని, సూక్తాలని నియమంగా పారాయణ చెయ్యాలి.
  • శివుడి కోసం పూలతోటలు పెంచటం, శివాలయాన్ని తుడిచి కడగటం, శివక్షేత్రంలో నివసించటం, పాధకులకు శివ అందిస్తాయి. 
  • ఇలా మానవులకే కాదు స్థావరాలైన చెట్లు తీగలకు జంగమలైనా క్రిమి కీటకాలకు కూడా శివాలయ నివాసం శివసాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
  • కాబట్టి భక్తులు శివాలయంలో నివసించటానికి ప్రయత్నం చెయ్యాలి .
  • మానవులు ప్రతిష్ఠించిన శివాలయంలో లింగం నుంచి వంద మూరల  దూరం వరకూ,ఋషులు ప్రతిష్ఠించిన క్షేత్రాలలో లింగం నుంచి వేల మూరల దూరం వరకు, దేవతా ప్రతిష్ఠశివలింగాలలో కూడా లింగం నుంచి వేయి మూరల వరకు, స్వయంభూ ప్రదేశాలలో శివలింగం నుంచి వేయిధనుస్సుల వరకూ ఉన్న దూరాన్ని ఋషులు పవిత్రమైన భూమి పరిగణిస్తారు.
  • శివ పుణ్యక్షేత్రాలలో ఉండే బావులు, చెరువులు వీటిలో ఉండే నీరు శివగంగ అంత పుణ్యప్రదమైనదని సాక్షాత్తు శివుడే చెప్పాడు.
  • కాబట్టి శివాలయాల సమీపంలో ఉన్న బావులు, చెరువులలో స్నానం చేసి వాటి సమీపంలో  దానధర్మాలు చేస్తే అఖండ పుణ్యం లభిస్తుంది.
  • మానవుడు మనణించేంతవరకు శివక్షేత్రాన్ని ఆశ్రయించుకు వుండాలి. 
  • మరణించిన వ్యక్తి శరీరాన్ని శివక్షేత్రంలో దహనం చేసినా లేక పదోరోజు కర్మను చేసిన, లేదా మాసికం, సపిండీకరణం, ఆబ్దికం పెట్టిన పిండప్రదానం చేసినా ఆజీవుడు పాపాలనుంచి విముక్తి పొంది శివసాయుజ్యాన్ని పొందుతాడు.
  • పవిత్రమైన శివక్షేత్రాలలో ఏడు రాత్రులుగానీ, కనీసం ఐదు రాత్రులుగానీ, మూడు లేక ఒక్క రాత్రి గానీ నివసిస్తే, కాలక్రమంలో ఆవ్యక్తికి శివలోకం లభిస్తుంది.
  • లోకంలో ఎవరైతే శివపూజని భక్తి ప్రపత్తులతో కోరిక తీరటం కోసం చేస్తారో, వారికి వెంటనే ఫలితం లభిస్తుంది. అలా కాక కోరిక లేకుండా పూజిస్తే శివపదం లభిస్తుంది.
  • కాలం అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని మూడ రకాలుగా ఉన్నది. సాధకులు ఉడయంపూట నిత్య కర్మలని, మధ్యాహ్నం కామ్య కర్మలని, సాయంత్రం శాంతి కర్మలని ఆచరించాలి. 
  • అలాగే రాత్రిపూటకూడా విభాగాలున్నాయి. రాత్రిపూట రాత్రికి పగలుకి మధ్య భాగంలో ఉండేదాన్ని నిశీధం అంటారు. ఆ సమయంలో శివపూజచేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. కనుక సాధకులు సమయాని గ్రహించి తదనుగుణంగా తమ ఉపాసన కొనసాగించాలి.
  • ఈ కలియుగంలో కర్మ చేయటం వల్లనే ఫలం లభిస్తుంది.
  • అందుకే అందరూ ధార్మిక ప్రవృత్తిని,పాపభీతిని కలిగి ఉండాలి.

Post a Comment

0 Comments