Ad Code

Responsive Advertisement

పుష్పయాగం - తిరుమల

  •  ప్రతి సంవత్సరం బ్రహోత్సవాల అనంతరం కార్తికమాసంలో శ్రవణ నక్షత్రం రోజున శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారికి "పుష్పయాగం జరుగుతుంది. 
  • క్రీ.శ. 15వ శతాబ్దం నాటికే తిరుమలలో జరుగుతూ అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ పుష్పయాగాన్ని క్రీ.శ. 1980 నవంబరు 14 నుంచి తి.తి.దేవస్థానం పునరుద్ధరించి నిర్వహిస్తున్నది
  • పుష్పయాగం జరిగే రోజు యథాక్రమంగా రెండు అర్చనలు రెండు నివేదనలు పూర్తి అయిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి కల్యాణమండపానికి వేంచేస్తారు. 
  • హోమాలు, స్నపన తిరుమంజనాదులు నిర్వహిస్తారు. 
  • పిదప ఆ మధ్యాహ్నం శ్రీస్వామివారికి వివిధ రకాలయిన పుష్పాలతో పుష్పార్చన జరుగుతుంది. 
  • ఈ పుష్పాలు శ్రీవారి హృదయం వరకు రాగానే వీటిని తొలగిస్తారు. 
  • మళ్లీ పుష్పార్చన జరుగుతుంది. ఇలా 20 మార్లు జరుగుతుంది. 
  • పిదప ఘనంగా హారతి సమర్పిస్తారు
  • పుష్పయాగంలో పాల్గొన్న భక్తులకు పూర్వజన్మల వాసనలు తొలగడమేగాక, సర్వరోగాలు నశిస్తాయి. తద్ద్వారా సుఖశాంతులతో ప్రశాంతంగా జీవనం సాగుతుంది.


Post a Comment

0 Comments