Ad Code

Responsive Advertisement

తులసి మహత్యం (బ్రహ్మవైవర్త పురాణం)



  • శ్రీకృష్ణుడి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసీదళం. ఈ తులసీ దళాలనే మాలగా చేసి శ్రీకృష్ణుడు ఎప్పుడూ మెడలో ధరిస్తాడు. 
  • పుణ్యప్రదమైన తులసీ వృక్షం కింద సమస్త దేవతలూ నివసిస్తారు. 
  • తులసి ఆకులు పడిన ప్రదేశం కూడా ఎంతో పవిత్రమైనదే. 
  • తులసీపత్రాలు వేసిన నీళ్ళతో స్నానంచేసిన వాడు పవిత్రుడవుతాడు సమస్త తీర్ధాలలో పుణ్యస్నానం ఆచరించిన ఫలితం అతడికి లభిస్తుంది.
  • తులసీపత్రాలతో నారాయణుణ్ణి అర్చిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అలాచేసినవాడికి లక్ష గోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది.
  • మానవుడు మృతిచెందే సమయంలో తులసీతీర్ధం ఇస్తే మరణించాక ఆవ్యక్తి తనపాపాలన్నిటినీ తొలగించుకుని విష్ణులోకానికి వెళతాడు.
  • ప్రతిరోజూ తులసి తీర్థాన్ని భక్తితో త్రాగే మానవుడికి జీవన్ముక్తి లభిస్తుంది అంతేకాదు పవిత్రమైన గంగానదిలో స్నానంచేసిన ఫలితం కలుగుతుంది.
  • ప్రతిరోజూ తులసీదళాలతో కృష్ణ పరమాత్మని పూజించినవాడు లక్ష అశ్వమేధయాగాలు చేసినంతపుణ్యం ప్రాప్తిస్తుంది.
  • తులసీదళం చేతిలో వుండగా మరణించినవాడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు.
  • తులసిమాలను ధరించినా అనంతమైన పుణ్యం మానవులకి లభిస్తుంది.
  • ఎవడైతే తులసీ పత్రాన్ని చేతితో తాకి తిరస్కరిస్తాడో వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలోనే ఉంటాడు. 

పౌర్ణమినాడు గానీ, అమావాస్య, ద్వాదశి, సూర్య సంక్రమణం తైలాభ్యంగనం చేసేప్పుడు, స్నానం చేయకుండా, మధ్యాహ్న సమయంలో రాత్రిపూట, ఉదయసాయం సంధ్యల్లో, అశుచిగా వున్నప్పుడు, జాతా, మృతాశౌచ సమయాలలో, రాత్రి ధరించిన వస్త్రాలు అలాగే వంటిమీద ఉన్నప్పుడు తులసీదళాన్ని తెంచకూడదు. అలా తెంపితే శ్రీమహావిష్ణువు తలని ఛేదించినంత పాపం కలుగుతుంది.

శ్రాద్ధకాలంలో, వ్రతాలు ఆచరించేడప్పుడు, దానం చేసేప్పుడు, దేవతావిగ్రహాల ప్రతిష్టాకాలంలో, దేవతార్చనలో ఉపయోగించిన తులసీదళం మూడు రోజులదాకా పవిత్రంగానే వుంటుంది.

విష్ణువుకి సమర్పించిన తులసీదళం భూమిమీద పడినప్పటికీ దాన్ని కడిగి ఇతర కార్యాలకి ఉపయోగించవచ్చు. 

ఇలా పరమపవిత్రమైన తులసి గండకీనదికి అధిష్ఠాన దేవతగా వుండి భారతీయలందరి చేతా పూజలందుకుంటుంది.



పూర్వం సరస్వతీదేవి వల్ల అవమానం పొందిన తులసి కోపంతో శ్రీహరి దగ్గర్నుంచి అంతర్ధానమై వెళ్ళిపోయింది. అప్పుడాయన తులసీవనానికి వెళ్ళి తులసిని ఘనంగా ఇలా స్తుతించాడు.


తులసీమంత్రం : 'శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా' అనే మంత్రం తులసీదేవిని శాస్త్రోక్తంగా పూజించాడు.


ఆవిధంగా శ్రీహరి చేసిన స్తోత్రానికి, పూజకి కోపం కరిగిపోయిన తులసి వెంటనే అక్కడికి వచ్చి శ్రీహరి పాదాలు మీద పడి క్షమించమని ప్రార్ధించింది. అప్పుడు శ్రీహరి ఆమెని అనునయించినేటినుంచి నిన్ను నా తలమీద, హృదయంమీద ఎల్లప్పుడూ ధరిస్తాను, అలాగే దేవతలు, మానవులు కూడా నిన్ను పవిత్రంగా పూజిస్తారు” అని వరమిచ్చాడు.


Post a Comment

0 Comments