Ad Code

Responsive Advertisement

తిరుమల - ఆణివార ఆస్థానం

 


  • ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటక సంక్రాంతి నాడు తిరుమలలో  ఈ ఉత్సవం జరుగుతుంది.
  • ప్రతి సంవత్సరం జులై 16 న ఈ ఆస్థానం జరుగుతుంది.
  • తమిళుల అణిమాసంలో జరిగే ఆస్థానం కనుక దీనిని ఆణివార ఆస్థానం అంటారు.
  • పూర్వం రోజులలో ఈ రోజు సంవత్సర లెక్కలు ప్రారంభం అయ్యేవి. ఇప్పుడు ఏప్రిల్ లో ప్రారంభం అయిన ఉత్సవం మాత్రం అలాగే జరుగుతుంది.
  • ఆ రోజు బంగారు వాకిలిముందు సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవులతో శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు. 
  • మరొక పల్లకిపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసిన పిదప ఘనంగా వస్త్రసమర్పణ, నివేదనలు జరుగుతాయి. 
  • తరువాత  అక్షతారోపణ జరిగిన తర్వాత కార్యనిర్వహణాధికారికి దేవస్థానం బీగాల గుత్తిని తగిలించి ఆరతి, శఠారులను ఇస్తారు. 
  • ఆ తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది.
  • ఈ కార్యక్రమం బంగారు వాకిలి ముందు జరుగుతుంది 

Post a Comment

0 Comments