Ad Code

Responsive Advertisement

Dress Code: సాంప్రదాయ దుస్తులతో ఆలయ దర్శనం



తిరుమలలోని  శ్రీవారి ఆలయంలోకి ఎవరూ టీషర్ట్, లేదా పొట్టి బట్టలు ధరించి ప్రవేశించకూడదు. ఇక్కడ మహిళలకు చీర లేదా సల్వార్ సూట్ ధరించాలని, పురుషులు కూడా షాట్స్ వేసుకోకూడదని ఆలయ నిబంధన.

కర్ణాటకలోని గోకర్ణ జిల్లాలో ఉన్న ఈ శివాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది కర్ణాటకలోని ఏడు విముక్తి ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ పురుషులు ధోతీ ధరించి మాత్రమే వెళ్లవచ్చు, మహిళలు చీర లేదా సల్వార్ సూట్ తప్పక ధరించాలి.

ఘృష్ణేశ్వర్ మహాదేవ్ ఆలయం, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి 11 కి.మీ దూరంలో ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కావడం దీని విశేషం. కొంతమందికి దీనిని ఘుష్మేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరుతో కూడా తెలుసు. ఈ దేవాలయంలోకి ప్రవేశించడానికి కూడా డ్రెస్ కోడ్ ఉంది. స్త్రీపురుషులు తప్పని సరిగా సాంప్రదాయ దుస్తులను ధరించాలి. పొట్టి బట్టలు వేసుకుని ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధం.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. ఇంకా ఇక్కడ కూడా భక్తులకు డ్రెస్ కోడ్ ఉంది. ముఖ్యంగా గర్భగుడిలోకి వెళ్ళడానికి స్త్రీలకు చీర లేదా సల్వార్ సూట్, పురుషులకు ధోతి తప్పనిసరి.

కేరళలోని గురువాయూర్ కృష్ణ దేవాలయం కూడా భక్తుల కోసం డ్రెస్ కోడ్‌ను కలిగి ఉంది. ఇక్కడ మహిళలు సాంప్రదాయ దుస్తులు అంటే చీర లేదా సల్వార్ సూట్‌లో వెళ్లాలి, పురుషులు ధోతీ ధరించాలి.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, డెహ్రాడూన్, రిషికేశ్ ఆలయాల్లో పొట్టి దుస్తులతో ఆలయానికి వచ్చే భక్తులను నిషేధిస్తున్నట్లు మహానిర్వాణి పంచాయతీ అఖారా ప్రకటించింది. హరిద్వార్‌లోని దక్షప్రజాపతి ఆలయం, డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం, నీలకంఠ ఆలయం పౌరి, రిషికేష్‌లోని మహాదేవ్ ఆలయం ఈ నియమాన్ని అమలు చేస్తున్న దేవాలయాలుగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని ఏ దేవాలయంలోనైనా ఇలాంటి డ్రెస్ కోడ్ అమలులోకి రావడం ఇదే తొలిసారి.

Post a Comment

0 Comments