Ad Code

Responsive Advertisement

శ్రీ బొలికొండ రంగనాథ స్వామి వారి ఆలయం - తొండపాడు (అనంతపురం)

శ్రీ రంగనాథస్వామి వారి ఆలయం బొలికొండ పర్వతం మీద తొండపాడు గ్రామంలో అనంతపురం జిల్లాలో ఉంది ఈ ఆలయం.



ఈ పర్వతం పేరు శ్వేతగిరి, గ్రామస్తులు మాత్రం బొలికొండ అని పిలుస్తారు.

పురాణాల ప్రకారం ఒక్కసారి  మహావిష్ణువు ఈ పర్వతం మీద సేదతీరాడు అని, అది తెలుసుకున్న మునులు స్వామి వారి సేవించారు అని, వాళ్ళ విన్నపం మేరకు స్వామి ఇక్కడ శిలాగా మారారు అని తెలుస్తుంది. కొన్ని రోజులు తరువాత ఇక్కడ విగ్రహం కనపడకపోవతంతో గ్రామస్తులు రంగనాథ స్వామివారిని ప్రతిష్టించారు.

ముఖ్యమైన పండుగలు :

బ్రహ్మోత్సవాలు
సంక్రాతి
కార్తీక మాసం 
ధనుర్మాసం
వైకుంఠ ఏకాదశి 

ఆలయ వేళలు 

ఉదయం 8  నుండి మధ్యాహ్నం 1.30 వరకు

సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.30  వరకు 

ఎలా వెళ్ళాలి :

గుత్తి నుండి 8  కి.మీ దూరంలో, తాడిపత్రి నుండి 43  కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి - 42 (కి.మీ దూరంలో)
యాగంటి ఉమామహేశ్వర స్వామి - 76
మహానంది - 131
అహోబిలం  - 143
దేవుని కడప - 149
మంత్రాలయం  - 150 

Post a Comment

0 Comments