Ad Code

Responsive Advertisement

శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం - ఆచంట



శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట అనే  పట్టణంలో  ఈ  ఆలయం వెలసింది. ఈ ఊరిని పూర్వం మార్తాండాపురం అని పిలిచేవారు.

ఇక్కడ స్వామి వారు స్వయంభు. ఇక్కడ శివుడిని అచ్చంటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని ఉమాదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో వినాయక స్వామి, సరస్వతి అమ్మవారు, సప్తమాత్రికల ఉపలయాలు ఉన్నాయి.

తూర్పు చాళుక్యుల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయ రాజగోపురం చాల పెద్దది.



ఈ ఆలయంలో ఆరు శివలింగాలు ఉన్నాయి అవి లక్ష్మణేశ్వర లింగం, సోమేశ్వర లింగం, మార్కండేయ లింగం, భీమలింగం, స్కంద లింగం, ఇంద్ర లింగం ఉన్నాయి.

పూర్వం ఆచంట నుండి ఇద్దరు శివ భక్తులు కాశీకి వెళ్లి లింగోద్భవ కాలంలో శివుని దర్శించాలి అనుకున్నారు. ప్రయాణం మొదటిలో వారికీ ఒక వేశ్య కనబడుతుంది . వారిలో ఒకరు మనసు మార్చుకొని ఆమెతో వెళ్తే, ఒకరు కాశీకి వెళతారు.

కాశీకి వెళ్లిన వ్యక్తి శివుని దర్శించిన మనసు మాత్రం ఇక్కడ వేశ్య మీద ఉంటుంది. ఇంకొకరు కాశీకి వెళనప్పటికీ భక్తితో శివ పూజ చేస్తాడు. భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడ అచ్చంటేశ్వర స్వామిగా వెలుస్తాడు.



ముఖ్యమైన పండుగలు 

మహాశివరాత్రి

కార్తీక పౌర్ణమి

వినాయక చవితి

దసరా

ఆలయ వేళలు

ఉదయం 06.00  నుండి రాత్రి 08.30 వరకు.

ఎలా వెళ్ళాలి :

పాలకొల్లు నుండి 20 కి.మీ  బస్సు, రైల్ సౌకర్యం ఉంది.

రాజమండ్రి విమానాశ్రయం నుండి 70 కి.మీ దూరంలో  ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

అబ్బిరాజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం - 16 కి.మీ
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం - 23
భీమవరం శ్రీ మావుళ్ళమ్మ వారి ఆలయం - 42
ఇస్కాన్ రాజమండ్రి - 52

Post a Comment

0 Comments