Ad Code

Responsive Advertisement

వేదమంత్రాల గొప్పతనం



  • వేదమంత్రాలను చక్కని ఉచ్ఛారణతో, అర్థయుక్తంగా పఠించాలి. తప్పులు చదువకూడదు. శబ్ద ఉచ్ఛారణ దోషాలు మహాపాపం. 
  • వేదమంత్రాల శక్తితో పరమాత్మ సంతుష్ఠుడవుతాడు. ఫలితంగా మానవుల కామితార్థాలు నెరవేరుతాయి. 
  • దివ్యజ్ఞాన పరమార్థం వేదశబ్దాలలోనే ఉంటుంది. 
  • వేదమంత్రాలను సశాస్త్రీయంగా వినిపించాల్సిన బాధ్యత విద్వాంసులదే. 
  • ఈ చరాచర సృష్టిలో వేదమంత్రాల నడుమ నిర్వహించే హోమంలో సర్వప్రాణుల ప్రసన్నత కోసం భౌతికాగ్ని యుక్తంగా మంత్రాల శక్తిని వాడతారు. 
  • ముఖ్యంగా హోమాగ్నికి ఏడు నాలుకలుంటాయి. 
  • ‘కాలీ’ అనే నాలుక (అగ్నిజ్వాల) తెలుపు రంగును ప్రకాశింపజేస్తుంది. 
  • ‘కరాలీ’ అనే నాలుక (అగ్నిజ్వాల) అతికఠినమైంది. 
  • ‘మనోజవా’ అనే నాలుక (అగ్నిజ్వాల) మనోవేగవంతం. 
  • ‘సులోహితా’ నాలుక (అగ్నిజ్వాల) అగ్నికణాలను విడుదల చేస్తుంది. 
  • ‘విశ్వరూపి’ అనే జిహ్వ (అగ్నిజ్వాల) అన్ని రంగులనూ కలిగి ఉంటుంది. 
  • ఈ జిహ్వాగ్ని జ్వాలలనుండి ఉద్భవించే శక్తి తరంగాలు అత్యంత తేజోవంతమైనవి. 
  • ఈ హోమజ్వాలల ద్వారా మానవుడు విశేష ఫలాలను పొందుతాడు.

Post a Comment

0 Comments