Ad Code

Responsive Advertisement

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత - విశిష్టత



  • ఈ కాలంలో హైందవులలో మరే పూజకూ లేనంత విశేష ఆదరణ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి లభిస్తున్నది. 
  • ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కలియుగంలో సత్యదేవుని వైభవం చెప్పనలవి కానంతగా ఉన్నది. 
  • ముఖ్యంగా ప్రతీ సంవత్సరం కార్తీకమాసం వంటి పుణ్యనెలలైతే దీనికి పెట్టింది పేరు. నిజానికి పెండ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి పెద్ద శుభకార్యం ఏది జరిగినా సత్యదేవుని ఆరాధన తప్పనిసరి. 
  • ఈ వ్రతం చేసుకోవడానికి ప్రత్యేకించి తిథి, వారం వర్జ్యం అంటూ ఏవీ అక్కర్లేదు. 
  • ఏడాది పొడుగునా ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ వారం నాడైనా చేసుకోవచ్చు. దీని వైభవానికి ఇదీ ఒక కారణం. 
  • భక్తులకు ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, ఆనందాన్ని, సుఖసంసారాన్ని, కీర్తిప్రతిష్ఠలను ఇలా అన్ని రకాల కోర్కెలను తీర్చగల అద్భుతదేవుడిగా సత్యనారాయణస్వామి ప్రగాఢ విశ్వాసాన్ని చూరగొన్నారు. 
  • ఈ సందర్భంగా పౌరోహితుడు ఆసక్తికరమైన అయిదు పౌరాణిక కథలను శ్రావ్యంగా వినిపిస్తాడు. 
  • స్కాందపురాణంలోని రేవాఖండంలో ఈ వ్రతకథ గురించిన వివరాలు ఉన్నాయి. తెలుగువారికి అత్యంత ఆరాధ్యనీయుడైన ‘సత్యదేవుని ఆలయం’గా అన్నవరం ఎంతో ప్రసిద్ధినొందింది. 
  • ఇది తూర్పుగోదావరి జిల్లాలో పంపానది ఒడ్డున వెలసింది. 
  • ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా తమ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి స్వామి సన్నిధిలో శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించుకోవాలని కలలు కంటారు.

Post a Comment

0 Comments