Ad Code

Responsive Advertisement

శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం - రామతీర్థం, నెల్లూరు.




కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయం రామతీర్థం గ్రామంలో సముద్రతీరాన ఉన్నది. సముద్ర తీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు, సైకతం (ఇసుక)తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన పవిత్రస్థలి ఇది. ఆంధ్రరాష్ట్ర రామేశ్వరంగా, దక్షిణ కాశీగా విలసిల్లుతున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో భక్తులు సముద్రస్నానం ఆచరించి, స్వామి వారికి మొక్కుకుంటే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

యుగాలు మారినా తరగని భక్తితో స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కావడంతో ‘రామతీర్థం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుచూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు స్వామి వారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రిక ఆధారాలు ఉన్నవి. 18వ శతాబ్దంలో స్థానికులు  స్వామివారు స్వప్న దర్శనంతో ప్రేరణ పొంది ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 

ముఖ్యమైన పండుగలు :

ముక్కోటి ఏకాదశి
కార్తీక పౌర్ణమి
మహాశివరాత్రి 
దసరా 
బ్రహ్మోత్సవాలు 

ఆలయ వేళలు 

ఉదయం 06.00 నుండి రాత్రి 08.30 వరకు.

ఎలా చేరుకోవాలి :

నెల్లూరు నుంచి దాదాపు 30 కిలో మీటర్లు ఉంటుంది. 

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయం - 33 కి.మీ దూరంలో 
నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం - 33 కి.మీ దూరంలో 
జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం - 41 కి.మీ దూరంలో 
వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - 46 కి.మీ దూరంలో 
సింగరాయకొండ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - 101 కి.మీ దూరంలో 


Post a Comment

0 Comments