Ad Code

Responsive Advertisement

Adhika Masam: అధిక మాసం 2023

 

  • అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని, మాల మాసం అని కూడా పిలుస్తారు 
  • మన కాలగమనంలో ప్రస్తుతం ఎక్కువగా చాంద్రమాన పద్ధతి, సౌరమాన పద్ధతి ఆచరణలో వున్నాయి.
  • చంద్రుని గమనం ఆధారంగా చాంద్రమానం ఏర్పడితే,సూర్యుని గమనాన్ని అనుసరించి సౌరమానం లెక్కించబడుతుంది.
  • చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి 29 1/2 రోజులు పడుతుంది. చాంద్రమానం ప్రకారం మనకు 354 రోజులు ఉంటాయి.
  • భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి సుమారు 365.25 రోజులు పడుతుంది. 
  • చాంద్రమానం, సూర్యమానం మధ్య తేడా 11 రోజులుగా ఉంటుంది.
  • ఈ తేడాను సరిదిద్ది, చాంద్రమాన, సౌరమాన సంవత్సరం సమన్వయం చేసేందుకే అధిక మాసాన్ని ఏర్పాటు చేసారు. 
  • వేద కాలం నుంచే ఇది ఆచరణలో వుంది. అధికమాసం అయిదు సంవత్సరాలలో రెండు సార్లు ఏర్పడుతుంది.
  • అధికమాసాన్ని సూర్య గమనాన్ని ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు ప్రతినెలలోనూ ఒకరాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీన్నే సూర్య సంక్రమణం అంటున్నారు.
  • ఏ నెలలో అయితే సూర్య సంక్రమణం జరుగదో, ఆ నెలనే అధికమాసంగా  చెప్పబడుతోంది.
  • చంద్రగమనం ప్రకారం ప్రతీ నెలలో చంద్రుడు పౌర్ణమినాడు ఒక నిర్ణీత నక్షత్రంలో ఉంటాడు, అంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గర ఉంటే అది ఆనాటి నక్షత్రంగా చెప్పబడుతోంది.
  • కానీ అధికమాసంలో మాత్రం చంద్రుడు పౌర్ణమి నాడు తాను కాకుండా వేరే నక్షత్రంలో వుంటాడు. 
  • అంటే చంద్రుడు చిత్త నక్షత్రంలో కాకుండా వేరే నక్షత్రంలో వుంటే, అప్పుడు అధిక చైత్రం అవుతుంది. 
  • తరువాత వచ్చే నెలలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంలో వుండటంచేత అది నిజ చైత్రమాసం అవుతుంది.
  • అదేవిధంగా తక్కిన నెలల్లో కూడా పౌర్ణమి చంద్రుడు నిర్దిష్ట నక్షత్రంలో లేనప్పుడు, ఆయా నెలలు అధిక మాసాలుగా చెప్పబడుతాయి.
  • అధిక మాసం వచినప్ప్పుడు అధికమాసం వచ్చిన  తర్వాత  వచ్చే  నేలపేరుతోనే  అధికమాసం పిలవబడుతోంది.
అధిక మాసం 2023 తేదీలు : జులై  18 నుండి ఆగష్టు  16 వరకు.

Post a Comment

0 Comments