Ad Code

Responsive Advertisement

Appalayagunta Temple: జూలై 6న అప్పలాయగుంటలో పుష్పయాగం


అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 6వ తేదీ గురువారం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూలై 5న రాత్రి అంకురార్పణ నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే.

ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికిప్రాయశ్చిత్తంగాపుష్పయాగం నిర్వహిస్తారు.

 గురువారం ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.40 నుండి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments