Ad Code

Responsive Advertisement

ధ్వజస్తంభం దేని తో చేస్తారు ?



ప్రతి ఆలయం ముందు ధ్వజ స్తంభం కనిపిస్తుంది. అల్లంత దూరం నుంచే అందరి కంటా పడుతుంది. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ధ్వజస్తంభాన్ని నారేప చెట్టు నుంచి తయారు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకున్న నారేప వృక్షాన్ని సంస్కృతంలో అంజనా అని పిలుస్తారు. వాల్మీకి రామాయణంలోనూ ఈ చెట్టు ప్రస్తావన ఉంది. అశోక వనంలోని వివిధ వృక్షాల్లో అంజనా కూడా ఉందట.



నారేప వృక్షం దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది. గోదావరి, ప్రాణహిత, కావేరీ నదీ పరీవాహక ప్రాంతాల్లోని అడవుల్లో ఇవి ఉన్నాయి. ఈ చెట్టు 24 నుంచి 30 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. చెట్టు చుట్టుకొలత మూడు మీటర్ల పైమాటే! ఈ చెట్టు తక్కువ కొమ్మలతో నిటారుగా పెరుగుతుంది. కాండం చాలా గట్టిగా ఉంటుంది. జిగురు ఎక్కువగా ఉండడంతో గట్టిగా ఉంటుంది. దీనిని యంత్రాల సహాయంతో కోయడం కూడా కష్టంతో కూడుకున్న పనే! ఎండకు, వానకు తట్టుకొని నిలబడుతుంది. నారేప కలపకు చెదలు పట్టడం అరుదు. చాలా కాలం మన్నికగా ఉంటుంది. ఈ ప్రత్యేకతలే నారేప చెట్టును ధ్వజస్తంభంగా నిలబెట్టింది. కాలక్రమంలో నారేప వృక్షాలతో పాటు మద్ది, టేకు కలపను కూడా ధ్వజస్తంభాలుగా వాడుతున్నారు.

Post a Comment

0 Comments