Ad Code

Responsive Advertisement

జాబాలి తీర్థం - తిరుమల



  • జాబాలి  తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిశలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
  • తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే దారిలో ఉంది ఈ తీర్థం.
  • జాబాలి తీర్థం పరిసరాల్లో ఆధ్యాత్మికత తొణికిసలాడుతుంటుంది.
  • చుట్టూ చిక్కని పచ్చదనం, మధ్యలో కోనేరు, చూడముచ్చటగా ఉంటుంది. జాబాలి అనే మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేదట. భగవంతుని కోసం ఆయన కఠోర తపస్సు ఆచరించిన పుణ్య ప్రదేశం ఇది. అందుకే ఈ తీర్థం.. జాబాలి తీర్థంగా ప్రసిద్ధిగాంచింది.
  • ఇక్కడి తీర్థంలో రాముడు స్నానమాచరించాడని అంటారు. ఆ తీర్థాన్నే ‘రామకుండం’గా పిలుస్తున్నారు. ఈ తీర్థ ప్రాశస్త్యం స్కాంద, వరాహ పురాణాల్లోనూ కనిపిస్తుంది.
  • జాబాలి తీర్థంలో వెలసిన ఆంజనేయుని ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది. 
  • ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. 
  • జాపాలి తీర్థాన్ని ‘ఆనందాశ్రమం’గా కూడా అభివర్ణిస్తారు. 
  • ఇక్కడ స్వామి దర్శన మాత్రం చేత, మానసిక ఆనందం సిద్ధిస్తుందని నమ్మకం.
  • దుష్ట గ్రహ నివారణకు, ఆరోగ్య సిద్ధికి స్వామిని సేవిస్తారు. 
  • కొందరు భక్తులు ఏడు మంగళవారాలు ఈ ఆలయానికి విచ్చేస్తారు. 
  • 108 ప్రదక్షిణలు చేసి వారి మనసులోని కోరికలను, బాధలను స్వామివారికి విన్నవించుకుంటారు.
  • దశాబ్దాలుగా హాథీరామ్‌జీ మఠం ఆధ్వర్యంలో ‘జాపాలి ఆంజనేయస్వామి’ ఆలయ నిర్వహణ సాగుతోంది. 


Post a Comment

0 Comments