Ad Code

Responsive Advertisement

నక్తాలు అంటే ఏమిటి?



నక్తముఅంటే రాత్రి. ‘నక్త వ్రతంఅంటే ఉదయం నుంచి ఏదీ తినకుండా ఉపవాసాన్ని పాటించి, రాత్రి స్నానాదులు ఆచరించి, నక్షత్రాన్ని దర్శించిన తరువాత ఆహారాన్ని తీసుకొనే నియమం. దీనినే క్లుప్తంగానక్తాలుఅని కూడా అంటారు. ప్రధానంగా కార్తీక మాసంలో నక్తాలను ఆచరిస్తూ ఉంటారు. రాత్రి నక్షత్ర దర్శనం చేసి, దీపం వెలిగించిన తరువాత భుజిస్తారు. నెల మొత్తం ఇలా చెయ్యడానికి సహకరించనివారూ, ఇతర కారణాలు ఉన్నవారు కార్తీక సోమవారాల్లో నక్తాలు చేస్తారు. అది కూడా వీలుకాకపోతే చవితి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో వ్రతాన్ని పాటిస్తారు.

Post a Comment

0 Comments