Ad Code

Responsive Advertisement

కార్తిక దీపం ఎలా వెలిగించాలి? ఏం చదవాలి?



కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కార్తిక మాసం. కృత్తిక అగ్ని నక్షత్రం. కాబట్టి దీపం రూపంలో అగ్నిని పూజించడం దీనిలో ఉన్న అంతరార్థం. కార్తిక మాసంలో రోజూ వెలిగించి, ఆలయ ధ్వజ స్తంభానికి వేలాడదీసే దీపాన్ని ‘ఆకాశ దీపం’ అంటారు. కార్తిక దీపం వెలిగించేటప్పుడు శివారాధన చేయాలి. ‘దామోదర మావాహయామి’ అని విష్ణువునూ, ‘త్య్రయంబక మావాహయామి’ అని శివుడినీ స్మరిస్తూ దీపం వెలిగించాలి. దాని మీద పువ్వులూ, పసుపు, కుంకుమ, అక్షతలు వెయ్యాలి. ఆ దీపాన్ని ఆకాశం వైపు చూపిస్తూ..
 
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే.. ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం న చ జన్మ భాగినః
భవన్తి త్వ శ్వపచాహి విప్రాః 

అనే శ్లోకం చదివి, నమస్కరించాలి. ‘చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు... ఇలా ఈ భూమి మీద నివసించే ప్రతి జీవీ ఈ దీపం వెలుగును దర్శించగానే మరుజన్మ లేని అనంత పుణ్యాన్ని పొందాలి’ అని ఆ శ్లోకం అర్థం. కృత్తికా నక్షత్రం, పౌర్ణమి తిథి కలిసి ఉండే రోజు కాబట్టి కార్తిక పౌర్ణమి రోజున వెలిగించే దీపం అఖండమైన ఫలితాలను అందిస్తుందన్నది పెద్దల మాట. కార్తిక పౌర్ణమి నాడు దీప దానం చేసినవారి పాపాలన్నీ నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments