Ad Code

Responsive Advertisement

అట్టుకల్ పొంగలా

కేరళలోని అనంతపద్మనాభ స్వామివారి సహోదరి సైతం తిరువనంతపురంలో కొలువై ఉంది. ఆ అమ్మవారే అట్టుకల్ భగవతి దేవి, మలయాళ మాసమైన కుంభమాసంలో భగవతి అమ్మవారికి ఓ విశేష ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవమే అట్టుకల్ పొంగలా.



తిరువనంతపురంలో వెలసిన అట్టుకల్ భగవతి అమ్మవారిని సాక్షాతూ పార్వతీదేవి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. కేరళలోని ప్రసిద్ధమైన దేవి ఆలయాలలో ఈ ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది.పార్వతీదేవి ఓ బాలిక రూపంలో ఈ క్షేత్రంలో వెలసింది అని భక్తులు నివేదించిన పాయసాన్ని నైవేద్యంగా స్వీకరించింది అని ప్రతీతి. అందుకు గుర్తుగా ప్రతి ఏటా ఈ క్షేత్రంలో అట్టుకల్ పొంగలా ఉత్సవం నిర్వహిస్తారు.

అట్టుకల్ భగవతి పొంగలా ఉత్సవం పదిరోజులపాటు జరుగుతుంది. మొదటి ఎనిమిది రోజులు ఆలయంలో విశేష ఉత్సవాలు జరిగిన అనంతరం, తొమ్మిదో రోజు పొంగలా ఉత్సవం నిర్వహిస్తారు. సూర్యోదయానికి పొయ్యలు సిద్ధం చేసుకుని మహిళలు బారులు తీరుతారు. అమ్మవారి ఆలయంలో సైతం ఒక్కా పెద్దపొయ్య సిద్ధం చేస్తారు. ప్రధానార్చకులు గర్భాలయంలోని మొదటి పొయ్యని వెలిగిస్తారు. 

మహిళలు అందరు ఉపవాసంతో ఉంటారు. పాయసం నివేదనం పూర్తీ అయిన తరువాత రాత్రి వేళ అమ్మవారిని ఘనంగా ఊరేగిస్తారు. మరుసటి రోజు అమ్మవారి ఉత్సవమూర్తి ఆలయ పునఃప్రవేశంతో అట్టుకల్ పొంగలా ఉత్సవం ముగుస్తుంది.  

2019 : ఫిబ్రవరి 12  నుండి 21  వరకు 
ముఖ్యమైన రోజులు : 20 ,21

Post a Comment

0 Comments