Ad Code

Responsive Advertisement

కుమారారామం - సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయం

పంచారామ క్షేత్రాలలో ఒక్కటి అయిన సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది.



తారకాసురుని మెడలోని అమృతలింగాన్ని ఛేదించిన కుమారస్వామే,ఆ అమృతలింగపు ఒక భాగాన్ని ఇక్కడ ప్రతిష్టించాడు. అందుకే ఈ క్షేత్రానికి కుమారారామం అనే పేరువచ్చింది.

ఇక్కడ స్వామి వారు కుమార భీమేశ్వరుడు అని పేరు. అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా పిలుస్తారు.

ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది.. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు.

 దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి.

ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది.

ఇక చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు.

పండుగలు :


  • కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి.
  • దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
  • శివరాత్రి ముఖ్యమైన పండుగ.
  • ప్రతి సంవత్సరం మాఘ బహుళ ఏకాదశి రోజు స్వామి,అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతుంది.


ఆలయ వేళలు 

ఉదయం 6 నుండి 12 వరకు
సాయంత్రం 4 నుండి 8  వరకు.

చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :


  • భావనారాయణ స్వామి వారి ఆలయం
  • శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయం
  • శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం - ద్వారపూడి.

ఎలా చేరుకోవాలి :

కాకినాడకు 11 కి.మీ దూరంలో, రాజమండ్రి కి 48 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. 

Post a Comment

0 Comments