Ad Code

Responsive Advertisement

శ్రీ సిద్ధవటేశ్వర స్వామి వారి ఆలయం - సిద్దవటం

కడప జిల్లాలోని సిద్ధవటాన్ని శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా భావిస్తారు. ఒకప్పుడు ఈ క్షేత్రంలో మర్రిమానుల కింద సిద్ధులు తపస్సు చేసుకునేవారట. ఈ నేపథ్యంలో సిద్ధవటం అనే పేరు స్థిరపడింది. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన సిద్ధవటేశ్వర స్వామి భక్తులను సదా అనుగ్రహిస్తుంటాడని నమ్మకం. కామాక్షి దేవి ఆలయం మరో అద్భుతం. కార్తీక మాసం, మహాశివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.



సాక్షాత్తూ శివుడే నిత్యానంద ఋషి అవతారమెత్తి కొండ సొరంగ మార్గంలోని గుహలో తపస్సు చేస్తూ శివలింగం గా మారినట్లు స్థానిక పూజారులు చెబుతారు.

ఈ క్షేత్రంలో వారంలో ఒకరోజు (సోమవారం) అన్నదానం నిర్వహిస్తారు.

ఎలా వెళ్ళాలి :

సిద్ధవటం కడప పట్టణానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప నుంచి బస్సులు, ఆటోల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

నిత్యపూజ కోన, కపర్థీశ్వర స్వామి ఆలయం, జ్యోతి సిద్ధవటేశ్వర ఆలయం, ఒంటిమిట్ట క్షేత్రం సిద్ధవటం దగ్గర్లో ఉంటాయి.

Post a Comment

0 Comments