Ad Code

Responsive Advertisement

శ్రీ భీమేశ్వరస్వామి వారి ఆలయం - ద్రాక్షారామం.




ప్రాచీన ఆంధ్రప్రదేశ్ త్రిలింగ దేశంగా పిలవడానికి కారణమైన మూడు క్షేత్రాలలో ఒక్కటి ద్రాక్షారామం.ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా లో ఉంది.

ఈ క్షేత్రంలో స్వామి వారికీ భీమేశ్వరుడు అనే పేరు.ఈ భీమేశ్వరస్వామిని పరమేశ్వరుని యొక్క తత్పురుష ముఖంగా చెబుతారు.కాగా అమ్మవారు మాణిక్యాంబగా కొలువుతీరింది.
మాణిక్యాంబ అమ్మవారు పద్యనిమిది మహాశక్తులలో ఒకరు. కాబట్టి ద్రాక్షారామం శైవ క్షేత్రంగానే కాకుండా శక్తిపీఠంగా కూడా పేరుపొందింది.

స్థల పురాణం :

కుమారస్వామి తారకాసురుని మెడలోని అమృత లింగాన్ని వధించినప్పుడు ఈ క్షేత్రంలో పడిన శకాలానికి, గోదావరి జలంతో సంప్రోక్షణ చేసి, ఇక్కడ ప్రతిష్టించాలి అని సప్తఋషులు భావిస్తారు. ఆ నదీమతల్లిని ద్రాక్షారామానికి ఆహ్వానిస్తారు. అందుకు సమ్మతించిన గోదావరి ఏడు పాయలుగా సప్తఋషుల వెంట ద్రాక్షారామాన్ని బయలుదేరుతుంది. 

మార్గమధ్యంలో ఋషులకు, రాక్షసులకు మధ్య వివాదం ఏర్పడుతుంది. అంత సద్దుమణిగి గోదావరి ద్రాక్షారామం చేరేసరికి సమయం మించిపోవడంతో దేవతల కోరిక మేరకు సూర్యుడు శకాలని ప్రతిష్ఠితాడు. 

అప్పుడు శివుడు సప్తఋషులతో భీమేశ్వరునికి, సూర్యుడే తొలి అర్చన చేయడం వల్ల ఆ ప్రదేశమంతా వేడిగా ఉంది అని, చల్లబరిచేందుకు ప్రధాన లింగానికి ఎనిమిది వైపులా చంద్రలింగాలను ప్రతిష్టించమని చెబుతాడు. ఆ ప్రకారంగా లింగానికి తూర్పున సూర్యుడు, ఆగ్నేయంగా కశ్యపుడు, దక్షిణాన అత్రి మహర్షి, నైరుతిన భరద్వాజుడు, పడమర వైపు విశ్వామిత్రుడు, వాయువ్యంలో గౌతముడు, ఉత్తరం వైపు  వశిష్ఠుడు, ఈశాన్యంలో జమదగ్ని చంద్రలింగాలను ప్రతిష్టించారు.

ప్రస్తుతం అవి వరుసగా కోలంక, దంగేరు,కోటిపల్లి, కోరు మిల్లి, వెంటూరు, సోమేశ్వరం,వెల్ల, పెనుమళ్ళ గ్రామాలలోని శివలింగాలని చెబుతారు. అందుకే వీటికి అష్ట సోమేశ్వర క్షేత్రాలు అని ప్రసిద్ధి ఉంది.

ఈ ఆలయం 1 వ శతాబ్దంలో పూజాలు అందుకున్నట్లు తెలుస్తుంది.

ఆలయం :

ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉండటం విశేషం. 5 ప్రాకారాలు కలిగి ఉంది ,పలు మండపాలు ఉపాలయాలు కనిపిస్తాయి. 

సుమారు 5  అడుగుల పొడవు, 5 అడుగుల  వెడల్పు గల పానవట్టం పై 14 అడుగుల ఎత్తుతో భీమేశ్వర లింగం దర్శనమిస్తుంది.గర్భాలయంలో ఒక చేత దాక్షాయణి(సతీదేవి) ప్రతిష్ఠురాలు అయింది.

ఇక ఆలయ రెండవ ప్రాకారంలో మాణిక్యాంబ ఆలయం ఉంది. ఈ దేవి శ్రీచక్ర మేరువుపై నెలకొని ఉండటం విశేషం.

ఆలయ వేళలు :

ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు
మధ్యాహ్నం 12 నుండి 3  వరకు ఆలయం మూసివేస్తారు.
ఒక మాసశివరాత్రి , మహాశివరాత్రి రోజు మాత్రం ఆలయం ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది.

పండుగలు :

మహాశివరాత్రి సందర్భంగానూ, దసరా నవరాత్రులలోను ఆలయంలో ప్రధాన ఉత్సవాలు జరపబడుతాయి. 
మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు శ్రీ మాణిక్యాంబ భీమేశ్వరాలకు, లక్ష్మి నారాయణులకు ఒకే పీఠం పై కళ్యాణం జరగడం విశేషం . అదే విధంగా ఆ గ్రామోత్సవం లో అయిన వీరు ఇద్దరిని ఊరేగించడం మరో విశేషం.

దేవస్థానం వారి గదులు అందుబాటులో వున్నాయి.

ఎలా వెళ్ళాలి  :

రాజమండ్రి నుండి 50 కి.మీ దూరంలో, కాకినాడ నుండి 25 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :

కుమారారామం - 44 కి.మీ 
అన్నవరం - 75 కి.మీ
శ్రీ ఉమా మార్కండేశ్వర దేవాలయం - రాజమండ్రి 48 కి.మీ
అష్ట సోమేశ్వరాలు.

Post a Comment

0 Comments